ఇక హరితవనంగా తెలంగాణ: ఇంద్రకరణ్‌ రెడ్డి

ik reddy
ik reddy

ఆదిలాబాద్‌: హరితహారంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని పురాతన ఓంకారేశ్వరాలయంతో పాటు, ఆర్‌అండ్‌బి కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టిందని కాబట్టి దీనిని విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా తమపైనే ఉందని ఆయన పేర్కొన్నారు.