ఆర్యవైశ్య మహాసభ కోశాధికారిగా కల్వ సుజాత

kalva sujata
kalva sujata

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కోశాధికారిగా కల్వ సుజాతను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సోమవారం ఆమెకు నియామకపు పత్రాన్ని అందజేశారు. తాండూరుకు చెందిన కల్వ సుజాత గతంలో కూడా ఆర్యవైశ్య మహాసభలో అనేక పదవులు నిర్వహించారు. సుజాత సామాజిక, స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు ఆర్యవైశ్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్న సుజాతను పలువురు రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు అభినందించారు.