ఆర్ధిక శాఖ అధికారులతో ఈటెల సమావేశం

EATELA RAJENDER
EATELA RAJENDER

హైదరాబాద్‌: సచివాలంలో ఆర్ధికశాఖ అదికారులతో ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మండలి చీఫ్‌ విప్‌ సుధాకర్‌ రెడ్డి, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దేవీప్రసాద్‌ హాజరయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లు, సమస్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రుల కమిటీ ఇవాళ రాత్రి వరకు సియం కేసిఆర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. మంత్రుల కమిటీ నివేదిక పరిశీలించిన తర్వాత ..ఈ నెల 14న సియం కేసిఆర్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేవమై చర్చించనున్నారు.