ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి.. ముగ్గురికి గాయాలు

Oil Tank Blast
Oil Tank Blast.

హైదరాబాద్‌(చిలకలగూడ): చర్లపల్లి సమీపంలో శుక్రవారం ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి మంటలు అంటుకున్న సంఘటనల్లో నలుగురు వ్యక్తులు ఒళ్లు కాలి గాంధీ ఆస్పత్రిలోచేరారు. వారిలో వెంకటేష్‌నాయక్‌(30) పరిస్థితి విషమంగా ఉందని మిగతా ముగ్గురికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని గాంధీ వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో 10శాతం గాయాలతో గోపాలచారి(40), 20శాతం గాయాలతో వాసు(20), మారుతి స్వామి 30శాతం కాలిన గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్నారు. ప్లాస్టిక్‌ సర్జన్‌ విభాగాధిపతి డాక్టర్‌ మహేందర్‌, కవిత తదితర ప్రొఫెసర్‌ స్థాయి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.