ఆధార్‌ నేపంతో ప్రవేశాలు నిరాకరించవద్దు

UIDAI
UIDAI

హైదరాబాద్‌: ఆధార్‌కార్డు లేని కారణంగా పిల్లలకు పాఠశాలల్లో అడ్మిషన్‌లు నిరాకరించరాదని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(యుఐడిఏఐ) తెలిపింది. ఈ తరహా కారణాలతో ప్రవేశాలు నిరాకరించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని పాఠశాలలు ఆధార్‌ లేదన్న నెపంతో విద్యార్థులకు ప్రవేశాలు నిరాకరించిన దాఖలాలు తమ దృష్టికి వచ్చాయని యుఐడిఏఐ తెలిపింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు యుఐడిఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్‌ కోసం పాఠశాలలు ఒత్తిడి చేయడంతో పాటుఎ పిల్లలతోపాటు8 వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. విద్యార్థుల ఆధార్‌ లేకపోతే అందుబాటులో ఉన్న ఇతర గుర్తింపు పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.