ఆద‌ర్శ తెలంగాణః మంత్రి హ‌రీష్‌

T. Harish rao
T. Harish rao

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో ఏ ఒక్క సమస్యనైనా శాశ్వతంగా పరిష్కరించారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలన బాగుంటే ఇంకా సమస్యలు ఎందుకున్నాయన్నారు. ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్‌ గోబెల్స్ ప్రచారం చేస్తోందని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో 14 లక్షల ఆయకట్టుకు నీరందించామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకున్నా రైతుబంధు, రైతు బీమా పథకాలు తెచ్చామన్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని, దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందని హరీశ్‌రావు అన్నారు.