ఆక్వా ఎక్స్‌పో-2019 ప్రారంభం

aqua expo -2019
aqua expo -2019

హైదరాబాద్‌: హైటెక్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఆక్వా ఎక్స్‌పో 2019ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..మత్స్యకారులను ఆదుకోవడంలో తెలంగాణ సర్కార్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఫిష్‌ సీడ్‌ను ఉచితంగా అందిస్తున్నామని, మత్య్సకారులకు 75 శాతం సబ్సిడీతో వాహనాలను అందజేశామని అన్నారు. సియం కేసిఆర్‌ చెప్పినట్లు నీటి వనరు ఎక్కువగా ఉన్న చోట చేపలను పెంచాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ఫిష్‌ సీడ్‌ పంపిణీ చేసినప్పటి నుంచి చేపలను మార్కెటింగ్‌ చేసుకునే దాకి అన్ని దశల్లో ప్రభుత్వం చేయూతను అందిస్తుందని తలసాని స్పష్టం చేశారు.