అమీర్‌పేట-ఎల్బీనగర్‌ మెట్రో రైలు ప్రారంభించిన గవర్నర్‌

metro
metro

హైదరాబాద్‌: అమీర్‌పేట నుండి ఎల్బీనగర్‌ వరకు మెట్రో పరుగులు ప్రారంభమయ్యాయి. ఈరోజు గవర్నర్‌ నరసింహన్‌ ఈ కొత్త మార్గాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రులు కెటిఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమీర్‌పేట్‌ నుండి ఎల్బీనగర్‌ వరకు 16 కిలోమీటర్ల పొడవులో 17 మెట్రో స్టేషన్లను ఏర్నాటు చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణికులకు అనుమతి ఉంటుందని మెట్రో అధికారులు చెప్పారు.