అమీర్‌పేట్‌-ఎల్బీనగర్‌ మధ్య ఆగస్టు నుంచి మెట్రో

Metro
Metro

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రోను గూగుల్‌కు అనుసంధానం చేస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…మెట్రోలో రోజుకు సుమారుగా నలభై వేల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. అమీర్‌పేట్‌-ఎల్బీనగర్‌ వరకు ట్రయల్‌రన్‌ జరుగుతుందని జులై చివరి నాటికి పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పారు. అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ వరకు మెట్రో రైలును అక్టోబర్‌లో ప్రారంభిస్తామని ఆయన అన్నారు.