అన్ని రంగాల్లో తెలంగాణ బెటర్‌ అని కేంద్రమే చెప్పింది

kcr sabha narsamprt
kcr sabha narsamprt

వరంగల్‌ రూరల్‌: ప్రజలు నాయకుల మాటలకు మోసపోవద్దని రాష్ట్రానికి ఏది మంచిదో ప్రజలు గుర్తించాలని కెసిఆర్‌ అన్నారు. జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈఆశీర్వాద సభలో కెసిఆర్‌ మాట్లాడుతు 58 ఏళ్లు పాలించిన టిడిపి,కాంగ్రెస్‌ కూటమి కట్లాయి. కాంగ్రెస్‌, టిడిపి కాలంలో ఏం జరిగిందో మీకు తెలుసు. వాళ్ల పాలనలో కరెంటు ఎన్ని గంటలు ఇస్తుండే మీకు తెలుసు. చంద్రబాబు ప్రపంచ మేధావి అనుకుంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌ కట్టానని చెప్పుకుంటున్నారు. తెలివిగళ్లవాళ్లమని చెప్పుకున్న ఆంధ్రా వాళ్లకు కూడా 24 గంటల అందడం లేదు అని కెసిఆర్‌  చెప్పుకొచ్చారు. ఎన్నో కార్యక్రమాలలో తెలంగాణ నెం.1 గా ఉందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ బెటర్‌ అని కేంద్రమే చెప్పిందని సీఎం పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా కళ్యాణలక్ష్మీ లాంటి పథకం తీసుకురాలేదని చెప్పారు.  రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్‌ తెలిపారు. రైతుబంధు లాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. మన రైతుబంధు పథకాన్ని ఐ.రా.స కూడా గుర్తించిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.