అక్ర‌మ పేలుడు ప‌దార్ధాల నిల్వ స్థావ‌రాల‌పై ఎస్ఓటి దాడులు

gelitin sticks
gelitin sticks

హైద‌రాబాద్ః గగన్‌పహడ్ వద్ద అక్రమంగా పేలుడు పదార్థాలను నిలువ ఉంచిన స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుల నుంచి 15 జిలెటిన్‌స్టిక్స్, 83 డిటోనేటర్లు, బ్యాటరీ, 2 కంప్రెషర్ ట్రాక్టర్లు, 2 హిటాచీలు, టిప్పర్‌ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.