అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే

kcr, telangana cm
kcr, telangana cm

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు గడిచినా పూర్తి స్థాయిలో మంత్రివర్గం కొలువు తీరలేదు. యాగం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై మళ్లింది. ఈనెలాఖరులోగా లేదా వచ్చేనెలా మొదటివారంలో కేబినెట్‌ విస్తరణ జరగవచ్చన ఊహగానాలు ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయి మంత్రివర్గం కాకుండా పరిమిత సంఖ్యలోనే నేతలకు అమాత్యయోగం లభించవచ్చని భావిస్తున్నారు. వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. యాగం పూర్తి కావడంతో పరిపాలనా, రాజకీయ సంబంధ అంశాలపై కేసీఆర్‌ పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. కెసిఆర్‌