అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐరిస్‌, బయోమెట్రిక్‌ విధానం

TUMMALA
TUMMALA

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐరిస్‌, బయోమెట్రిక్‌ విధానం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని అంగన్‌ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేందుకు ప్రయోగాత్మకంగా ఐరీస్‌ విధానాన్ని అమలు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అన్నిఅంగన్‌వాడీకేంద్రాల్లో బయో మెట్రిక్‌ విధానాన్ని కూడా అమలు చేయాలని కోరారు. శుక్రవారం సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమం, తెలంగాణ ఫుడ్స్‌తో పాటు వివిధ అంశాలపై ఉన్నతాధికారు లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవల కాలంలో తరచూ అంగన్‌వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలింతలు, గర్భిణీలు, శిశువులకు మహిళా శివు సంక్షేమ శాఖ ద్వారా అందుతోన్న పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. దీనిని నిరోధించేందుకు అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐరీస్‌ విధానాన్ని అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్దిదారులకు అందించే పథకాలకు సంబంధించి అధికారులు ప్రతిరోజు సమీక్ష నిర్వహించుకోవాలని అధికారులకు సూచించారు.