స్వీయనిర్బంధంలో తెలంగాణ పల్లెలు

బయటి వ్యక్తులు రాకుండా గ్రామస్థుల జాగ్రత్తలు

Telangana villages in self-restraint

Hyderabad: దేశ, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను ప్రజలు పాటిస్తూ కరోనా నివారణ చర్యల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పల్లెలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నాయి

గ్రామాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొలిమేరల్లో కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో 450 గ్రామాలు, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో వంద గ్రామాలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నాయి. సిద్దిపేట పల్లెల్లోకి రాకుండా రోడ్లపై ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు.

ఖమ్మం జిల్లాలో 250 గ్రామాల్లో సరిహద్దులు మూసివేశారు

నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ పల్లెల్లోనూ రాకపోకలపై గ్రామస్థులు ఆంక్షలు విధించారు

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/