థియేటర్లు ఓనర్స్ అసోసియేషన్ సమావేశం

థియేటర్లు తెరవాలని నిర్ణయించిన ఓనర్స్ అసోసియేషన్

cinema theatre

హైదరాబాద్‌: అన్ లాక్5లో భాగంగా ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లను ప్రారంభించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే 50 శాతం మంది ప్రేక్షకులతో మాత్రమే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ థియేటర్లు నడపాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సుదర్శన్ థియేటర్ లో తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశమైంది.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు విజయేంద్రరెడ్డి మాట్లాడుతూ, థియేటర్లను తెరవడానికి కేంద్రం అనుమతించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. థియేటర్లు తెరవాలని ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించిందని తెలిపారు. పార్కింగ్ రుసుము వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు. తమకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని విన్నవించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/