నేటి నుండి పదోతరగతి పరీక్షలు ప్రారంభం

ssc exam
ssc exam

హైదరాబాద్‌: ఈరోజు నుండి రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు కానున్నాయి. దాదాపు 5.52 లక్షల మంది (రెగ్యులర్‌, ప్రైవేటు) విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ, ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తిచేశాయి. పదోతరగతి రాత పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే విద్యార్థులకు అయిదు నిమిషాల పాటు వెసులుబాటు కల్పిస్తూ, 9.35 వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/