తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

హరీశ్ రావుకు ఆర్థిక శాఖ

K T Rama Rao, T Harish Rao take oath as ministers
K T Rama Rao, T Harish Rao take oath as ministers

హైదరాబాద్ : మలివిడత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మంత్రులుగా ఆరుగురికి అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సామాజిక, ప్రా ంతీయ ప్రాతిపదికను దృష్టిలో పెట్టుకుని మం త్రివర్గ కూర్పు చేశారు. వీరిలో హరీష్‌రావు, కె టిఆర్, సబిత ఇంద్రారెడ్డ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్‌లకు చోటు కల్పించారు. గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్‌లు తొలిసారి మంత్రులయ్యారు. వీరికి టిఆర్‌ఎస్ పార్టీ పట్ల ఉన్న అంకితభావం, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి చురుకుగా తీసుకెళ్లడంతోనే సిఎం కెసిఆర్ కేబినెట్‌లో చోటు కల్పించారని తెలిసింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం తొలి ప్రభుత్వంలో హరీశ్‌రావు, కెటిఆర్‌లు మంత్రులుగా పనిచేశారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత జ రిగిన మంత్రివర్గ కూర్పులో వారికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఇద్దరికీ అవకాశం కల్పించారు.కాగా ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కె. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ముఖ్యమంత్రులుగా కొనసాగిన హయంలో సబితా ఇంద్రారెడ్డి పదే ళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు. గతంలో మంత్రి గా పనిచేసిన అనుభవం దృష్టా సబితకు మం త్రిపదవి కట్టబెట్టారు. కాగా కొత్త మం త్రివర్గంలోకి ఆరుగురిని చేర్చుకోవడంతో రాష్ట్ర ం కేబినెట్ సంఖ్య 18కు చేరింది. మంత్రివర్గ విస్తరణపై కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో జోరు గా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. పైగా ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో తొలిసారి స్థానం కల్పించారు. రాష్ట్ర మంత్రివిస్తరణంలో సిఎం కెసిఆర్‌కు ఆరుగురికి అవకాశం కల్పిస్తే వారిలో నలుగురు ఒసిలు, బిసి, ఎస్‌టి వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. హరీష్‌రావు, కెటిఆర్, సబిత ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ ఒసి సామాజికి వర్గానికి చెందివారు కాగా, గంగుల కమలాకర్ బిసి, సత్యవతి రాథోడ్‌లు (ఎస్‌టి) సామాజిక చెందిన వారు.

తొలిసారిగా ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు


టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో తొలిసారిగా ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు లభించాయి. వీరిలో ఒకరు మహేశ్వరం నుంచి ఎంఎల్‌ఎగా గెలిచిన సబి తా ఇంద్రారెడ్డి కాగా, మరొకరు టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి సత్యవతి రాథోడ్. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత 2014, 2018లో జరిగిన వరస అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే కొన్ని సమీకరణల కారణంగా అప్పట్లో మహిళలకు మంత్రివర్గంలో సిఎం కెసిఆర్ స్థానం కల్పించ లేకపోయారు. సిఎం కెసిఆర్ రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ మలివిడత మంత్రి వర్గ విస్తరణలో ఒకరు కాదు…ఇద్దరు మహిళా శాసనసభ్యులకు అవకాశం కల్పిస్తామన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన హామి ఇచ్చిన విధంగా సిఎం కెసిఆర్ ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు కల్పించారు.