నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ 15వ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గం.కు ప్రారంభం కానున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా శాసనమండలి, శాసనసభను ఉద్దేశించి ప్రసంగించ నున్నారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం ప్రతిపాదించే ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరగనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020-21ను ఆదివారం శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించ నున్నారు. సోమవారం హోలీ కావడంతో సోమ, మంగళవారాలు అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించి తిరిగి బుధవారం నుంచి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
తాజా ఇపేరు వార్తల కోసం క్లిక్ చేయండి:https://epaper.vaartha.com/