మంత్రి నిరంజన్‌ రెడ్డి డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ

Minister Niranjan Reddy
Minister Niranjan Reddy

హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం, రాష్ట్ర మార్క్‌‌ఫెడ్ ఉద్యోగుల సంఘం 2020 డైరీ, క్యాలెండర్‌లను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. మార్క్‌ఫెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం రాష్ట్ర అధ్యకుడు మెండు అశోక్, గౌరవాధ్యక్షుడు బొబ్భ ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి అబ్దుల్ రఫీ, కోశాధికారి మాణిక్య ప్రభు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా డైరీ, కేలండర్‌లను తీర్చిదిద్దిన తీరును మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటు రైతులతోపాటు ఇతరత్రా ఆయా వర్గాలకు ఈ డైరీ ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/