తెలంగాణ లో ఈరోజు ఒక్క రోజే 2 వేలు దాటినా కరోనా కేసులు

Corona claw again in America

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి భారీగా పెరిగింది. ఈరోజు ఒక్క రోజే కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 2,295 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 64,744 పరీక్షలు నిర్వహించగా… 2,295 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,89,751కి చేరింది. వైరస్‌ బారిన పడి ముగ్గురు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి 278 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

ఇక జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,452 కొత్త కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 232, రంగారెడ్డి జిల్లాలో 218 కేసులు గుర్తించారు. రంగారెడ్డిలో 218, హనుమకొండ 54, సంగారెడ్డి 50, నిజామాబాద్‌, ఖమ్మంలో 29 చొప్పున కొత్త కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా మరోసారి ఉగ్ర రూపం చూపిస్తోంది. మహారాష్ట్రలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో తాజాగా 40,925 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మంది కొవిడ్​తో మృతి చెందారు. 14,256 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ముంబయిలో శుక్రవారం ఒక్క రోజే 20,971 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 6 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు.