తెలంగాణకు గుడ్ న్యూస్..తగ్గనున్న వర్షాలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది వాతావరణ శాఖ. మరో రెండు రోజుల్లో వర్షాలు తగ్గనున్నట్లు తెలిపింది. గత ఆరు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు పడుతుండడం తో అన్ని ప్రాజెక్ట్ లు నిండుకుండలా మారిపోయాయి. భారీ వరదలతో అన్ని ప్రాజెక్ట్ ల గేట్లు ఎత్తడం తో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇంకా ఎప్పుడో తగ్గుతాయో ఈ వర్షాలు అని అనుకుంటున్నా వేళ ..వాతావరణ శాఖ తీపి కబురు తెలిపింది.

శుక్రవారం నుంచి రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడతాయని వెదర్ మ్యాన్ సాయి తెలిపారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రజలకు వర్షాల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. దీంతో వరదలు కొంతమేర తగ్గుముఖం పడతాయన్నారు. ప్రస్తుతం అల్ప పీడనం ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ వైపు కదులుతోందన్న ఆయన.. దీని ప్రభావంతో గురువారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వర్షాల నుంచి లభించినప్పటికీ.. మళ్లీ వచ్చే వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమవారం నుంచి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్నట్టుగా వారం మొత్తం వానలు పడవని.. ఒకట్రెండు రోజులు మాత్రమే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.