తెలంగాణలోని ఆ నాల్గు జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాల్గు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు ఉప్పొంగిపొర్లుతున్నాయి. చాల చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. ఈరోజు , రేపు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖా చెప్పడం తో ప్రజలు భయపడుతున్నారు. మరోపక్క అధికారులు సైతం ప్రజలను బయటకు రవ్వొద్దని హెచ్చరిస్తున్నారు.

మంగ‌ళ‌వారం ఐదు జిల్లాల‌కు, బుధ‌వారం నాలుగు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ హెచ్చ‌రిక జారీ చేసింది. పెద్ద‌ప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం జిల్లాల్లో మంగ‌ళ‌వారం భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. బుధ‌వారం రోజు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఇక మిగ‌తా జిల్లాల్లో ఈ రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఇక హైదరాబాద్ నగరం జలనగరం గా మారింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసిముద్దవుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి.