మేడారం భక్తులకు అధికారుల సూచనలు

Medaram Jatara
Medaram Jatara

హైదరాబాద్‌: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పిలుచుకునే సమ్మక్కసారక్క జాతర ఈరోజు నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిఎం కెసిఆర్‌ ప్రభుత్వం రూ.75కోట్లను కేటాయించింది. దాదాపు కోటిన్నర మంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. అదనపు స్నానఘట్టాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, అంతర్గత రోడ్లు, పారిశుధ్య కార్యక్రమాలు, నిరంతర విద్యుత్తు సరఫరా, వైద్య సదుపాయాలను పూర్తి చేసింది. అయితే భక్తులు వేరే భక్తులకు ఇబ్బంది కలగనీయకుండా వ్యవహరించాలని, అధికార యంత్రాంగం సూచనలను పాటించాలని ప్రభుత్వం తెలిపింది. మేడారం వచ్చే భక్తులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. పలు గమనికలతో పోలీస్ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..

  • జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలతో ఇతర వాహనాలను ఓవర్ టెక్ చేయరాదు.
  • పోలీసులు సూచించిన మార్గాల్లోనే ప్రయాణం చేయాలి.
  • వాహనాలకు అనుమతి లేని చోట పార్కింగ్ చేయరాదు. నిబంధన అతిక్రమిస్తే వాహాన్ని పోలీస్ అధికారుల కంట్రోల్‌కు తరలిస్తారు.
  • జంపన్న వాగు స్నాన ఘట్టాల వద్ద ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించకూడదు.
  • అమ్మ వార్ల దర్శనానికి నిర్దేశించిన క్యూ లైన్లలోనే వచ్చి దర్శనం చేసుకోవాలి.
  • పోలీసుల నిఘా ఉంటుంది. సీసీ కెమెరాల ద్వారా భక్తుల చర్యలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/