ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాల విడుదల

TOSS Results
TOSS Results

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ ఫలితాలను విడుదల చేశారు. పదవ తరగతిలో 20,608 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 5,535 మంది(26.86 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మొత్తం 14,729 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 5,194 మంది(35.26 శాతం) ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ మేరకు ఫలితాలను తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టిఓఎస్‌ఎస్‌) డైరక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర శర్మ ఫలితాలను విడుదల చేశారు. అంతేకాకుండా రీ వ్యాల్యుయేషన్‌ చేసుకోదలచిన విద్యార్థులు ఒక్క సబ్జెక్ట్‌కు రూ. 600 ఫీజు చెల్లించి ఈ నెల 17నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని టిఓఎస్‌ఎస్‌ డైరక్టర్‌ ప్రకటించారు.
ఫలితాల కోసం telanganaopenschool.org, http://www.schools9.com వెబ్‌సైట్లు చూడాలని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/