వెలువడుతున్న మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు

ఆదిభట్ల మునిసిపాలిటీలోని 1, 2 వార్డుల్లో కాంగ్రెస్ విజయం
పరకాల, చెన్నూరు మునిసిపాలిటీల్లో టిఆర్‌ఎస్‌ విజయం

vote-counting
vote-counting

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెల్లడవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మునిసిపాలిటీలోని 1, 2 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించి బోణీ కొట్టింది. వరంగల్ రూరల్‌లో 12, 17 వార్డులను టిఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 12వ వార్డులో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.రాణి గెలుపొందగా.. 17వ వార్డులో పి. గోపి విజయం సాధించారు. పరకాల, చెన్నూరు మునిసిపాలిటీల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధించింది. పరకాలలో 22 వార్డులకు గాను 11 చోట్ల టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక చెన్నూర్‌లో 18 వార్డులకు 7 చోట్ల టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/