ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

సాయంత్రం 5 గంటల వరకు 75 శాతం పోలింగ్‌ నమోదు

telangana municipal elections
telangana municipal elections

హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 75శాతం పోలింగ్ నమోదయంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో ఓటింగ్ శాతం తగ్గింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారిని ఓటువేసేందుకు నిర్ణయించారు. గద్వాల, మంథని, పెద్ద అంబర్ పేట, నిజామాబాద్, కరీంనగరర్‌లో ఘర్షణలు జరిగాయి. 20 పురపాలక సంఘాల్లోని 1647 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు ఎన్నికలను నిర్వహించారు. ఇక ఈనెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం 27న మేయర్, ఛైర్ పర్సన్‌ల ఎన్నిక ఉండే అవకాశముంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/