యాద్రాది, నారాయణ్‌ఖేడ్‌లో టిఆర్‌ఎస్‌కు షాక్‌

Telangana municipal elections counting
Telangana municipal elections counting

హైదరాబాద్‌: తెలంగాణ లో పుర ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి కూడా అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులతే ముందజ కొనసాగుతుంది. అయితే యాదాద్రి, నారాయణ్‌ఖేడ్‌ మున్సిపాలిటీలు మాత్రం కాంగ్రెస్‌ సంస్థాగతం చేసుకున్నాయి. ఇప్పటికే ఐడిఐ బొల్లారం 22 వార్డులకు గాను 17 వార్డులు టిఆర్‌ఎస్‌ కైవసం అయ్యాయి. సత్తుపల్లి మున్సిపాలిటీ, అలంపూర్‌ మున్సిపాలిటీ, మరిపెడ మున్సిపాలిటీ, ధర్మపురిలో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హోరాహోరీ, డోర్నకల్‌, మహబూబాబాద్‌ 33 వ వార్డు, పెద్దపల్లి మున్సిపాలిటీ, మధిర 10వ వార్డులో కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. మొత్తం 9 నగర, 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా మొత్తం 9 కార్పోరేషన్లలోని 325 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం అయ్యింది. మిగితా ఫలితాలు వెలువడుతున్నాయి. అటు 120 మున్సిపాలిటీల్లో 2727 వార్డుల్లో 80 ఏకగ్రీవం అయ్యాయి. అందులో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు 77 వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 2979 వార్డులకు గాను టిఆర్‌ఎస్‌ 411 వార్డులు, కాంగ్రెస్‌ 121, బిజెపి 46, ఎంఐఎం 10, ఇతరులు 41 కైవసం చేసుకున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/