పురపాలక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి

nagi reddy, ec
nagi reddy, tengana ec

హైదరాబాద్‌: ఈ నెల 31వ తేదీన హైకోర్టు తీర్పు అనంతరం పురపాలక ఎన్నికల నిర్వహణకు ఎప్పుడైనా సిద్ధం గా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) కమిషనర్ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్రంలో పుర ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు, పురపాలక కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించింది. పురపాలక ఎన్నికల ఏర్పాట్లు, స న్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం గతంలోనే సమీకరించిన సామగ్రిని స రిచూసుకు ని వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని స్ప ష్టం చేశా రు. బదిలీ అయిన, మరణించిన ఉద్యోగు ల స్థాన ంలో శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఉద్యోగులకు ఎ న్నికల విధులు అప్పగించాలని కలెక్టర్లను ఆదేశించారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు సమావేశం అనంతరం కమిషనర్ మీడియాతో తెలిపారు. మీర్‌పేట కార్పొరేషన్‌లో వార్డుల విభజన జరగకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/