టిఆర్‌ఎస్‌ పార్టీకే మా సంపూర్ణ మద్దతు

telangana mrps team
telangana mrps team

సూర్యాపేట: త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీకే తమ పూర్తి మద్దతు అని తెలంగణ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. అయితే సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని కలిసిన రాష్ట్ర ఎమ్మార్పీఎస్ బృందం తమ మద్దతును ప్రకటించారు.ఎస్సి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడమే కాకుండా ప్రధాని మంత్రి వద్దకు కూడా తీసుకెళ్లి పార్లమెంట్ లో బిల్లు ను పాస్ చేయుంచేందుకు సీఎం కేసీఆర్ చేసిన కృషి తమ పట్ల కేసీఆర్ గారికి ఉన్న చిత్తశుద్ధి ని చాటుతుందని టి. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు.. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి చొరవ చూపలేదన్న వంగపల్లి, రాబోయే ఎన్నికల్లో 16 కు 16 పార్లమెంట్ స్థానాలలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని.ఇందుకు నల్లగొండ జిల్లా తో పాటు రాష్ట్రంలో ఉన్న మాదిగ సోదరి, సోదరమణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు..


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/