తెలంగాణ లో మళ్లీ ఎన్నికల సందడి మొదలుకాబోతున్నాయి

తెలంగాణలో రీసెంట్ గా హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక ఏ రేంజ్ లో జరిగాయో తెలియంది కాదు. ఇక ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలుకాబోతుంది. స్థానిక సంస్థల కోటాలో త్వరలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభకు ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ను ప్రకటించింది. అసెంబ్లీలో సంఖ్యా బలం ప్రకారం ఆరు స్థానాలను టిఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే మిగతా ఆరు స్థానాలకు మాత్రం పోటీ ఉండనుంది. ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణలో ఎలక్షన్ జోరు కనిపించబోతుంది. ఇక ఆ ఆరు స్థానాలకు బీజేపీ , కాంగ్రెస్ పార్టీ లు బరిలోకి దిగి ఆ స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి.