యాదాద్రిలో మంత్రి సత్యవతి రాథోడ్‌

స్వామి వారి దర్శనం.. ప్రత్యేక పూజలు

Minister Satyavathi Rathod
Minister Satyavathi Rathod

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గురువారం తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ… సిఎం కెసిఆర్‌ యాదాద్రి ఆలయాన్ని రాతి శిలలతో అందంగా, మహా దివ్యక్షేత్రంగా
అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. వచ్చే బ్రహ్మోత్సవాలు కొత్తగా నిర్మితమైన ఆలయంలో నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/