తెలంగాణ మంత్రి, ఎంపి ప్రయాణం ఆర్టీసి బస్సులో

minister puvvada ajay & mp nama nageswararao
minister puvvada ajay & mp nama nageswararao

ఖమ్మం: తెలంగాణ రవాణా శాఖ మంత్రి, టిఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు ఇద్దరు కలిసి తెలంగాణ ఆర్టీసి బస్సులో ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు ప్రయాణం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సుగుణ గార్డెన్స్‌ నందు రెండవ విడత గ్రామ బాట అవగాహన సదస్సు, ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి, ఎంపి ఇలా వినూత్నంగా బయల్దేరారు. ఎంపి నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సామాన్యుల జీవితంలో ఆర్టీసి ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసి పాత్ర చాలా కీలకం. అంతేకాకుండా ఆర్టీసి బస్సులో ప్రయాణం ఎంతో సురక్షితం అని ఆయన అన్నారు. ఇంకా ఆర్టీసిని లాభాల్లోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుందని చెప్పారు. అందులో భాగంగానే ప్రజాప్రతినిధులు కూడా ఆర్టీసిలో ప్రయాణం చేయాలని మంత్రి అజయ్ కుమార్‌ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని నామ నాగేశ్వరరావు మంత్రిని ప్రశంసించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/