ఆ వార్త గర్వంగా, సంతోషంగా అనిపించింది

ఉద్వేగంతో ట్వీట్‌ చేసిన మంత్రి కెటిఆర్‌

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: ఓ వార్తను చదివిన తరువాత తనకెంతో గర్వంగానూ, సంతోషంగానూ అనిపించిందని తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కెటిఆర్‌ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. “గౌరవనీయ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దూరదృష్టితో ప్రతి ఒక్కరికీ మంచి నీటిని అందిస్తున్నారు. మిషన్ భగీరథలో భాగంగా అందరు ఇంజనీర్లు, అధికారులు నల్గొండ తదితర జిల్లాల్లో ఎంతో శ్రమించారు” అంటూ గడచిన ఆరేళ్లలో నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు” అంటూ ఓ ఆంగ్ల దినపత్రికలో ఇచ్చిన కథనాన్ని కెటిఆర్‌ పోస్ట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/