సంగారెడ్డి “పట్టణ ప్రగతి”లో హరీశ్‌ రావు

Minister Harish rao
Minister Harish rao

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. పట్టణంలోని 8వ వార్డులో ఆయన పర్యటించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ప్రజలను కోరారు. పట్టణాలను అభివృద్ధి చేసుకునే గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు ఒక సాధారణ పౌరుడిలా వ్యవహరించి అందరిని ఆశ్చర్య పరిచారు. కార్యక్రమానికి వచ్చిన ప్రజలతో మమేకమై అందరితోపాటు ఆయన కూడా నేల మీద కూర్చోని ప్రసగించారు. ఈ కార్యక్రమంలో ఆయన వ్యవహరించిన తీరుకు అందరు ఆశ్చర్యపోయారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/