విమోచన దినోత్సవం రోజున సెలవు ప్రకటించడం..తెలంగాణను అవమానించినట్లే – బండి సంజయ్

విమోచన దినోత్సవం రోజున సెలవు ప్రకటించడం..తెలంగాణను అవమానించినట్లేనని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్..పార్టీ ఆఫీస్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నివాళులు అర్పించి, అనంతరం బండి సంజయ్ జాతీయ జెండా ఎగురవేశారు.

ఈ సందర్భాంగా బండి సంజయ్ మాట్లాడుతూ..’స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. ఏడాదిపాటు నరకయాతన భరించారు. మహిళలపై వారు చేసిన అకృత్యాలు అత్యంత ఘోరమైనవి. సెప్టెంబర్ 13 న ఆపరేషన్ పోలోను పటేల్ ప్రారంభిస్తే 17వ తేదీన విముక్తి లభించింది. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి ఎందరో మహామహులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. దీన్ని విమోచన దినోత్సవం అంటారు. దీన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎన్నో ఏండ్లుగా పోరాటం చేసింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన తర్వాత కానీ కేసీఆర్ దిగిరాలేదు. దారుస్సలాం నుంచి అనుమతి లభించాకే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిందంటే ఎంత నీచమైన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.” అని బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

అలాగే విమోచన దినోత్సవం రోజున సెలవు ప్రకటించడం..తెలంగాణను అవమానించినట్లేనని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు.. స్కూల్స్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ సెలవు ప్రకటించడం అవమానించడమేనని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.