ఆ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం!

high court
high court

హైదరాబాద్‌: తెలంగాణలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బిసి రిజర్వేషన్ల అంశాన్ని తేల్చే వరకూ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని కోరుతూ హైకోర్టులో బీసీ సంఘ నాయకులు వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దన్న ఉత్తర్వులు ఇవ్వలేమని, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్ల అంశంపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/