పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం

Municipal polls
Municipal polls

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో మొదటి పురపాలక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో రేపు (బుధవారం) పోలింగ్‌ జరగనుంది. మొత్తం 50 లక్షల మందికి పైగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గననున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబీర్‌పురా డివిజన్‌కు ఉప ఎన్నిక జరుగుతోంది. మొత్తం కార్పొరేషన్లలో 325 డివిజన్లకుగాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా పురపాలికల్లోని 2,727 వార్డుల్లో 80 ఏకగ్రీవమయ్యయి. 45 వేల మంది సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గననున్నారు. ఎన్నికల సిబ్బంది ఈ సాయంత్రానికి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అధికారులు రేపు సెలవు ప్రకటించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/