తెలంగాణ ఇంటర్‌ బోర్టు కీలక నిర్ణయం

Telangana Inter Board
Telangana Inter Board

హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాలపై గందరగళం ఏర్పడిన సందర్భంగా రీవెరిఫికేషన్‌ ఫలితాల బాధ్యత పై తెలంగాణ ఇంటర్‌ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబరీనా సంస్థపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ సంస్థతో పాటు మరో సంస్థకు ఫలితాల వెల్లడి బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది. మరో ఏజెన్సీ ఎంపిక బాధ్యత తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌)కు అప్పగించింది. అయితే త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/