ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

TS INTER BOARD
TS INTER BOARD


హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఇంటర్‌ బోర్డు మరోసారి పొడిగించింది. ఫీజు గడువు నేటితో ముగియనుండగా..విద్యార్ధులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మే2వ తేదీ వరకు ఫీజు గడువును పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. మే 2 తేదీ లోపు ఆన్‌లైన్‌ ద్వారా బోర్డుకు ఫీజు చెల్లించాలని అశోక్‌కుమార్‌ సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/