ఇంటర్‌ సెకండియర్‌ పుస్తకాలు విడుదల

Telangana Inter Board
Telangana Inter Board

హైదరాబాద్‌: ఇంటర్‌ సెకండియర్‌ ద్వితీయభాష(ఉర్దూ, సంస్కృతం, హిందీ, అరబిక్‌) పాఠ్యప్తుకాలను విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి విడుదల చేశారు.2014-15 విద్యాసంవత్సరంలో రూపొందించిన సిలబస్‌ను ఇప్పటివరకు అమలు చేశారు. అయితే నిబంధనల ప్రకారం ప్రతి ఐదేండ్లకు ఒకసారి సిలబస్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ పద్దతి మేరకు రూపొందించిన ద్వితీయభాష పుస్తకాలను ఈ విద్యాసంవత్సం నుండి అమలులోకి తీసుకొస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఏ అశోక్‌ తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/