నేడు ఇంటర్‌ రీవెరీఫికేషన్‌ ఫలితాలు విడుదల

Inter exam
Inter exam


హైదరాబాద్‌: ఈరోజు తెలంగాణలో ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాలతో పాటు జవాబు పత్రాలను కూడా ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ ఇంటర్‌ పరీక్షల్లో 3,82,116 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరందరి ఫలితాలను ఇంటర్‌బోర్డు రీవెరిఫికేషన్‌ చేయించింది. అందులో 92,429 మంది విద్యార్థుల సమాధాన పత్రాలను అధికారులు ఫునఃమూల్యాంకన చేశారు.హైకోర్టు విధించిన గడువు మేరకు ఈరోజు ఇంటర్‌బోర్డు ఫలితాలను విడుదల చేయనుంది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/