రేపు తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు

ఇటీవలే ఆ పరీక్షలను నిర్వహించిన ఇంటర్ బోర్డు


హైదరాబాద్: కరోనా కారణంగా తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. రద్దయిన ఆ పరీక్షలను ఇటీవలే నిర్వహించారు. ఈ క్రమంలో తొలి సంవత్సరం పరీక్షల ఫలితాలను రేపు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతలమీదుగా ఫలితాల విడుదలకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలకు మొత్తం 4,59,228 మంది విద్యార్థులు హా జరయ్యారు.

మరోవైపు ఈ విద్యా సంవత్సరం ఇంటర్ పరీక్షలను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 23 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా ఈ ఏడాది ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో వార్షిక పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/