తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇవాళ‌ సాయంత్రం 5 గంట‌ల నుంచి విద్యార్థుల‌కు వెబ్‌సైట్‌లో ఫ‌లితాలు అందుబాటులోకి రానున్నాయి. ప‌రీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు మంత్రి తెలిపారు. ఉత్తీర్ణ‌త సాధించిన వారిలో 2,28,754 మంది బాలిక‌లు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. మొత్తం ఉత్తీర్ణ‌త సాధించిన వారిలో 1,76,719 మంది విద్యార్థులు ఏ గ్రేడ్, 1,04,888 మంది విద్యార్థులు బీ గ్రేడ్, 61,887 మంది సీ గ్రేడ్, 1,08,093 మంది విద్యార్థులు డీ గ్రేడ్ సాధించారు. క‌రోనా మ‌హ‌మ్మారి దృష్ట్యా ఇంట‌ర్ సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఫ‌లితాల కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/