ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా

Telangana Inter Board
Telangana Inter Board

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్‌బోర్డు మరోసారి వాయిదా వేసింది. ఈనెల 25నుండి జరగాల్సిన పరీక్షలను జూన్‌ 7 నుండి 14 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.తొలుత వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు దొర్లడంతో రాష్ట్రంలో పెను రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో జవాబుపత్రాలను పునఃమూల్యాంకన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి నిర్వహించాల్సిన అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలను మరోసారి వాయిదా పడ్డాయి.


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/