తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ షెడ్యూల్‌ విడుదల

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ షెడ్యూల్‌ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్‌ బోర్డు. ఆగస్ట్‌ 1 నుండి 10వ తేదీ వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వాల్యుస్‌ పరీక్ష జూలై 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ ఎగ్జామ్‌ను జూలై 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక మంగళవారం ఇంటర్‌ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తం మొత్తం 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 464892 విద్యార్థులకు గాను 294378 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 63.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 72.3 శాతం కాగా, అబ్బాయిలు 54.24 శాతం మంది పాస్ అయ్యారు. ఇక సెకండియర్‌లో 67.96 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి కూడా ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలే హవా సాగించారు. ఫస్టియర్‌లో 63.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా ఫస్ట్‌, హన్మకొండ రెండవ స్థానంలో నిలిచాయి.