తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌

ఎన్నికలపై ఉన్న స్టే ఎత్తివేత

Telangana High Court
Telangana High Court

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని 73 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిపించేందుకు కొద్దిసేపటి క్రితం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునిసిపల్ ఎన్నికలపై ఉన్న స్టేను ఎత్తివేస్తున్నట్టు స్పష్టం చేసింది. జులైలో ఇచ్చిన నోటిఫికేన్ ను రద్దు చేసిన హైకోర్టు, తిరిగి మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి, ఎన్నికలు జరిపించాలని సూచించింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదంటూ దాఖలైన అన్ని పిటీషన్లను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలపై గత కొన్ని నెలలుగా హైకోర్టులో వాదప్రతివాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం, నేడు తీర్పును ప్రకటించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/