గ్రూప్‌-2 ఎంపిక కొనసాగించండి

telangana high court
telangana high court

హైదరాబాద్‌: గ్రూప్‌-2 బబ్లింగ్‌, వైట్‌నర్‌ వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సాంకేతిక కమిటీ సిఫారసుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టిఎస్‌పిఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్‌, వైట్‌నర్‌ అభ్యర్ధులను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై స్పందించిన టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ చక్రపాణి..హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. త్వరలోనే మెరిట్‌ జాబితా, ఇంటర్వ్యూల షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/