బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట

సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని ఆదేశం

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టు లో ఊరట లభించింది. బండి సంజయ్ వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ను కొట్టివేసిన హైకోర్టు.. బండి సంజయ్ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. బండి సంజయ్ జుడిషియల్ రిమాండ్ పై స్టే విధించింది. వ్యక్తిగత పూచి రూ. 40 వేలు ఖర్చుపై విడుదల చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు పోలీసులపై కార్యకర్తలతో దాడి చేయించారనే ఆరోపణలతో నమోదైన కేసుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కరీంనగర్‌ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కరీంనగర్ జిల్లా జైలులో ఉన్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను సవరించాలంటూ కరీంనగర్‌లో జాగరణ దీక్షకు పూనుకున్న సంజయ్‌ని పోలీసులు జనవరి 2న రాత్రి తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/