తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి

జూన్ 8 నుంచి ఒక్క ఉత్తర్వును అమలు చేయలేదని ఆగ్రహం

TS high court
TS high court

హైదరాబాద్‌: కరోనా కేసుల్లో తమ ఆదేశాలు అమలు కావడంలేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జూన్ 8 నుంచి ఒక్క ఉత్తర్వును అధికారులు అమలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయడం కష్టమైతే ఎందుకో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం నిన్న విడుదల చేసిన కరోనా బులెటిన్‌లో కూడా సరైన వివరాలు లేవని హైకోర్టు ఆక్షేపించింది. కరోనా విషయంలో ఏం చేయమంటారో రేపు సీఎస్‌నే అడుగుతామని వ్యాఖ్యానించింది. కరోనా కేసులన్నింటిపై విచారణ రేపటికి వాయిదా వేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/