కరోనా బులిటెన్‌ రోజూ విడుదల చేయాలి..హైకోర్టు

రాష్ట్ర ప్రభత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించింది. జనవరి 25 నుంచి ఈనెల 12 వరకు టెస్టుల వివరాలను నివేదికలో తెలిపింది. జూన్ 3 నుంచి డిసెంబర్ వరకు 3 సీరం సర్వేలు జరిగాయని పేర్కొంది.

రెండో దశ కరోనా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదన్న  హైకోర్టు  ఆందోళన వ్యక్తం చేసింది. వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపింది. శుక్రవారం నుంచి కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాలని ఆదేశించింది. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానంపై విస్తృత ప్రచారం చేయాలంటూ.. తదుపరి విచారణ మార్చి 18కి హైకోర్టు వాయిదా వేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/